హయత్ నగర్ మదర్ డెయిరీ ఉద్యోగి మరణం

డెయిరీ ముందు బంధువుల ఆందోళన

హయత్ నగర్ మదర్ డెయిరీ ఉద్యోగి మరణం

హయత్ నగర్ మదర్ డెయిరీలో సుమారు ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగి తులసి బాల నరసింహ విధి నిర్వహణ విధి నిర్వహణలో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని మదర్ డెయిరీ కార్యాలయం వద్ద ఉంచి నిరసనకు దిగారు.మరణించిన ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం యజమాన్యం కుటుంబ సభ్యులకు 50 వేల పరిహారమిచ్చి అంతక్రియలకు అందజేశారు.బోర్డు సమావేశం నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని మదర్ డెయిరీ ఎం.డి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

14 Feb 2026 02:55 PM
రంగారెడ్డి

www.nagaranijam.com 14 Feb 2026 02:55 PM
Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News