సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం

500 మంది విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ శిక్షణ

 మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్‌లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు చాగంటి మాట్లాడుతూ ఆహార విక్రేతలకు క్షేత్రస్థాయిలో అవసరమైన మెళకువలను నేర్పించారు. ఆహరం వడ్డించే వారు చేతులు కడుక్కోవడంతో పాటు తలపాగాలు ధరించడంతో పాటు ఈగలు, దుమ్ము పడకుండా ఆహారాన్ని భద్రపర్చాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన ప్రతి విక్రేతకు ప్రత్యేక శిక్షణ కిట్లు అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన పలువురు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాకు రుచి గురించి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణ ద్వారా సురక్షితంగా ఆహారాన్ని ఎలా అందించాలో నేర్చుకున్నామని ఇది మాపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ పొందిన మందికి ఫుడ్, హైజిన్ కిట్స్, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ కధిరవన్ పలాని, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ డైరెక్టర్ బాలునాయక్ కేతవత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

19 Mar 2026 08:33 AM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

www.nagaranijam.com 19 Mar 2026 08:33 AM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు
హయత్ నగర్, 19, మార్చి (నగర నిజం) : హయత్ నగర్ మునగనూరు రోడ్‌లోని వక్ఫ్ బోర్డు ప్రాంగణంలో మజిదే బిలాల్ మజీద్ ఆధ్వర్యంలో మహమ్మద్ సల్మాన్...
సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ