నీటిలో మునిగి విద్యార్థి మృతి
సంఘీ నగర్, మార్చి 29 (నగర నిజం) : సంఘీ నగర్ పరిసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోహెడ గ్రామానికి చెందిన పంచల నరేష్ అనే విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు.స్థానికుల వివరాల ప్రకారం, నరేష్ తండ్రి పంచాల నాగనాథ్. నరేష్ కోహెడ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కోహెడ నుంచి సంఘీ నగర్ వైపు గండి చెరువు వెళ్లే దారిలోకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనుకోకుండా నీటిలో జారి పడటంతో మునిగి పోయినట్లు తెలుస్తోంది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments