పెంచిన ఫీజులు తగ్గించాలి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఫీజులు అధికంగా పెంచారంటూ తల్లితండ్రులు పాఠశాల వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఫీజులు అధికంగా పెంచడంతో భారం పెరుగుతుందని వాపోయారు. పాఠశాలలో జాయిన్ అయినప్పుడు 2- 5% పెంచుతామని తెలియజేసి ఇప్పుడు ఏకంగా 15-20 % ఫీజులు పెంచడంతో విద్యార్థులను చదివించాలంటే భారం ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు లేట్ గా కట్టడంతో ఫెనాల్టీ పేరుతో అధికంగా కడుతున్నామని, యూనిఫామ్, స్కూల్ బుక్స్ మార్చడంతో తల్లిదండ్రులపై భారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments