శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం

హయత్ నగర్, 24,IMG-20251123-WA1794IMG-20251124-WA0370నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, బీఆర్ఎస్ మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు నాణ్యమైన చర్మ, జుట్టు చికిత్సలు అందించేందుకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. హయత్ నగర్ పరిసరాల్లో ఇలాంటి ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ఆనందకరమని అన్నారు. నిర్వాహకులు వైద్యులు డాక్టర్ వి. మనోజ్ఞ, డాక్టర్ కే. అక్షిత, డాక్టర్ చెవుగాని శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సేవలు ఇవ్వడానికి క్లినిక్ సిద్ధంగా ఉందని తెలిపారు. చర్మవ్యాధులు, జుట్టు ఊడటం, లేజర్ చికిత్సలు, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పవన్ సాయి హాస్పిటల్ ఎండి ఆలేటి శ్రీనివాస్ గౌడ్, సిఐ నాగరాజు గౌడ్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి క్లినిక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెవుగాని జానయ్య గౌడ్, సింహాచలం పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం