భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా కమిటీని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మరాజుల శేఖర్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా.అధ్యక్షుడిగా గుర్రం వెంకన్న,జనరల్ సెక్రటరీ & ఇన్‌ఛార్జ్‌గా వేముల కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వల్లెపు అంజయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.జిల్లా కమిటీ నియామకాలకు సంబంధించిన ఆర్డర్ కాపీని జాతీయ ఉపాధ్యక్షుడు ఎత్తరి మారయ్య జిల్లా నాయకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ శివరాత్రి వెంకటేష్,తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డేరంగుల రూపమేశ్వరి,స్టేట్ యూత్ సెక్రటరీ ఇరాగదిండ్ల రమేష్ పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకన్న వడ్డెర సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని,సమాజ అభివృద్ధి, విద్య, ఉపాధి, హక్కుల పరిరక్షణ కోసం సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి వడ్డెర సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments