లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడిన పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్

 లంచం స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడిన పెద్ద అంబర్‌పేట్ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్

పెద్ద అంబర్ పేట్, అక్టోబర్ 29, (నగర నిజం): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం , పెద్ద అంబర్‌పేట్‌లోని ఎ.ఇ. (ఆపరేషన్స్) కార్యాలయంలో పనిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు లంచం స్వీకరిస్తూ పట్టుకున్నారు.బండ్లగూడలోని తాజా టిఫిన్స్ వద్ద ఫిర్యాదుదారుని నుండి రూ.6 వేల లంచం తీసుకుంటూ ప్రభు లాల్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రేయస్ ఇంజనీరింగ్  కాలేజ్ సమీపంలోని కొత్త అపార్ట్‌మెంట్‌కు 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ మరియు కొత్త మీటర్ల సేవా నంబర్లు విడుదల చేయడానికిగాను ప్రభు లాల్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ ప్రకటనలో తెలిపింది.లంచం మొత్తం రూ.6 వేల రూపాయలు ప్రభు లాల్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నాంపల్లి స్పెషల్ కోర్టులో నిందితుడిని హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు.లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఫిర్యాదులు చేయడానికి ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సంప్రదించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్ల కసరత్తు
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి గోవిందు కిరణ్ కి ఘన స్వాగతం
రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
శ్రీరంగవరం గ్రామంలో భూత్ నిర్మణ్ అభియాన్ కార్యక్రమం
భారతీయ వడ్డెర సమాజ సేవ సంఘం మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు
శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం