రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి జిల్లా వ్యవసాయ అధికారి కి వినతి పత్రం
రుణమాఫీ చేయకుంటే కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమంటున్న రైతులు
మేడ్చల్ మండలంలోని మూడు సొసైటీలలో ఉన్న రైతులకు సరిగా రుణమాఫీ జరగలేదని, రుణమాఫీ కానీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రికల్చర్ అధికారికి పీఎసీఎస్ మాజీ ఛైర్మన్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీఎసీఎస్ మాజీ ఛైర్మన్ లు మాట్లాడుతూ డబిల్ పూర్ లోని పీఎసీఎస్ సొసైటీలో 668 మంది రైతులకు గాను 347 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, మిగతా 321 మందికి రుణమాఫీ జరగలేదని తెలిపారు. మేడ్చల్ పీఎసీఎస్ సొసైటీ లోని 449 మంది రైతులకు గాను 351 మందికి రుణమాఫీ జరిగిందని, 129 మందికి రుణమాఫీ జరగలేదన్నారు. పూడూర్ పీఎసీఎస్ సొసైటీ లోని 650 మంది రైతులకు గాను 210 మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, 440 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. డబిల్ పూర్ లోని ఎస్బీఐ బ్యాంకులో 400 మంది పైచిలుకు రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని, రైతులకు సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంకు అకౌంట్లు హోల్డ్ లో పెట్టారన్నారు. రుణమాఫీ జరుగుతుందని రైతులు సకాలంలో ఇంట్రెస్ట్ డబ్బులు చెల్లించకపోవడం వలన 7 శాతానికి గాను 11 శాతం పడుతుందన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దజచేసి రైతులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. లేదంటే రైతుల పక్షాన కోర్టుకు వెల్లడానికి కూడా సిద్దమన్నారు. ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ సురేష్ రెడ్డి, మేడ్చల్ పీఎసీఎస్ ఛైర్మన్ రణదీప్ రెడ్డి, పూడూర్ పీఎసీఎస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments