విధి నిర్వహణలో.. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి 

రక్తదానం ప్రాణదానంతో సమానం

IMG-20251030-WA1717IMG-20251030-WA1718IMG-20251030-WA1738గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి

మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి

ఇబ్రహీంపట్నంలో మెగా రక్తదాన శిబిరం 

పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు

సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది సైతం రక్తదానం

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 30 ( నగరనిజం ) : విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సంధర్భంగా గురువారం ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్ లో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి ఘటించారు. రక్తదానం శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, పోలీస్ సిబ్బంది అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మెగా రక్తదాన శిబిరాన్ని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తమ పోలీసులు కలిసి కుటుంబ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. పోలీసుల అమరత్వాన్ని కొనియాడుతూ అవగాహన సదస్సులు, ర్యాలీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలన్నారు. గ్రామాల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాంతి,భద్రతల విషయంలో పోలిసులకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

*రక్తదానం ప్రాణదానంతో సమానం*

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపదలో వారి ప్రాణాలు కాపాడటానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అన్ని దానాల కన్న ప్రాణదానం మిన్న అనే నినాదాన్ని పలు కళాశాలల విద్యార్థులు, యువకులు నిజం చేశారని చెప్పారు. విద్యార్థులు, యువకులు, పోలీసులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. రక్తదానం చేయడం వల్ల మనుషులను ప్రాణాపాయం నుండి కాపాడగలుగుతామన్నారు. రక్తదానం చేయడంతో మూడు రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటికే రక్త నిల్వలు పడిపోయి ఆపదలో ఉన్నవారికి రక్తం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. అందుకే రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని వైద్యులు చెపుతున్నారని, కనీసం ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతామని చెప్పారు. రక్తం అందుబాటులో లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తే, ఆపదలో ఉన్నవారికి రక్తం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

*గంజాయి, డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి*

గంజాయి, డ్రగ్స్ కు యువత, విద్యార్థులు, దూరంగా ఉండాలని మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి సూచించారు. సమయాన్ని వృధాగా చేస్తూ మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులకు, యువతకు పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. రక్తదాన శిబిరంలో విద్యార్థులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదాన శిబిరంలో భాగస్వాములైన 200 మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతర రక్తదానం చేసిన విద్యార్థులకు, యువకులకు, సిబ్బందికి పోలీసులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, మధు, సత్యనారాయణ, నందీశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విధ్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

30 Oct 2025 05:13 PM
క్రైమ్ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం

www.nagaranijam.com 30 Oct 2025 05:13 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
మేడ్చల్:- ఎల్లంపేట్  మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ...
బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు 
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార 
మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.