లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్.హెచ్.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
ఎస్‌ఐ లక్ష్మీనారాయణ – 8712662286
పీఎస్ హయత్ నగర్ – 8712662640

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments