(మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో 'ఆపరేషన్ సింధుర్'లో పాల్గొంటున్న దేశ సైనికులకు సంఘీభావం
మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారులోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం (మల్లారెడ్డి హెల్త్ సిటీ)లో 'ఆపరేషన్ సింధుర్'లో పాల్గొంటున్న దేశ సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి హాజరయ్యారు.యుద్ధంలో వీరమరణం పొందిన ఎం. మురళినాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన మల్లారెడ్డి, "భారత సైనికులను చూసి దేశ ప్రజలంతా గర్వపడుతున్నారు. సరిహద్దులు భౌగోళికంగా మాత్రమే కాక దేశ భద్రతకు సంకేతం. దేశ భవిష్యత్తు కోసం సైనికులు పోరాడుతున్నారు" అని అన్నారు.మతం పేరుతో టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలచివేసిందని అన్నారు. ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన దాడి సరైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో దేశంలోని ప్రతి యువతీ యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.యుద్ధ సమయంలో అవసరమైతే మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. సైనికుల కోసం రక్తదానానికి కూడా సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు."బార్డర్లో మనం పోరాటం చేయకపోయినా, సైనికులకు అవసరమైన రక్తం, వైద్యసేవలు అందించడానికి ప్రతి పౌరుడి బాధ్యత. సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. భారత సైనికులారా, మీరు బార్డర్లో పోరాడుతున్నప్పుడు, మీ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధత మాకు గర్వకారణం, మీ పోరాటం మాకు స్ఫూర్తి" అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం దేశభక్తిని మేల్కొలిపే సందర్భంగా నిలిచింది.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments