లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ

లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు

• లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు
• 5వ తేదీ నుంచి 17వరకు మీ సేవా కేంద్రాల్లో స్వీకరణ
• ఇంటర్ లో గణితం నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత
రంగారెడ్డి జిల్లా : భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి (భూ హక్కుల రికార్డు) చట్టం-2025 ను ఏప్రిల్ 14న  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని
తెలిపారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా,రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) దరఖాస్తులను ఆహ్వానించిందని,  ఈ నెల 5వ తేదీ నుంచి
రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు,
ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు
దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ లో గణితంతో 60% మార్కులు సాధించిన వారు,ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో  తేదీ:26-05-2025 నుండి 26-07-2025 వరకు 50 పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని, ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు