నర్కూడ వద్ద రెడీమిక్స్ వాహనం బీభత్సం

అదుపుతప్పి బైకును ఢీ కొట్టిన రెడీమిక్స్ వాహనం

నర్కూడ వద్ద రెడీమిక్స్ వాహనం బీభత్సం

నర్కూడ వద్ద రెడీమిక్స్ వాహనం బీభత్సం 

అదుపుతప్పి బైకును ఢీ కొట్టిన రెడీమిక్స్ వాహనం 

అర్జున్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి 

మృతుడు మొయినాబాద్ (మం) నాగిరెడ్డిపల్లి వాసిగా గుర్తించిన పోలీసులు

డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు 

రాజేంద్రనగర్, మే 6 (నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని నర్కూడ వద్ద ఓ రెడీమిక్స్ వాహనం బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టి వ్యక్తి ఉసురు తీసింది. మృతుడు మొయినాబాద్ మండలం లోని నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన అర్జున్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన నర్కూడ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... గంగపాక అర్జున్ (50) అనే వ్యక్తి మంగళవారం నాడు నాగిరెడ్డి గూడ గ్రామం నుండి బైక్ (నంబర్ టీఎస్ 07, ఈజెడ్ 8029) పై ఏదో పని నిమిత్తం శంషాబాద్ కు బయలుదేరాడు. అయితే శంషాబాద్ మండలంలోని నర్కూడ ప్రభుత్వ స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ సిమెంట్ వాహనం (నెంబర్ ఏఎస్ఓ1, డిడి 7904) అదుపుతప్పి బైకు పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అర్జున్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రమాదానికి కారకుడైన రెడీమిక్స్ వాహనం డ్రైవర్ ను స్థానికులు చితక బాది పోలీసులకు అప్పగించారు. అర్జున్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు.... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ రెడ్డి వెల్లడించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి