ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, షుగర్, జ్వరం వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు అధికంగా పాల్గొని వైద్యుల సలహాలు తీసుకున్నారు.వైద్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులు, పరిశుభ్రత, సరైన ఆహారం, వ్యాయామం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని శిబిరాన్ని సందర్శించారు. శ్రీనివాస్ గౌడ్, అమర్ బన్సోడే, గోనే శ్రీనివాస్ తదితరులు ప్రజలతో మాట్లాడి ఇలాంటి శిబిరాలు తరచూ నిర్వహించడం అవసరమని తెలిపారు.ఎఎన్ఎమ్ ఎన్. సుదీవెన పర్యవేక్షణలో ఆశా కార్యకర్తలు జి.ఉమ, రాధిక, జె. దేవిక శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20260404-WA0036

04 Apr 2026 02:47 PM
సికింద్రాబాద్

www.nagaranijam.com 04 Apr 2026 02:47 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

ఉచిత వైద్య శిబిరం నిర్వహణ ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్, 4 ఏప్రిల్ (నగర నిజం) : ఉత్తర లాలాగూడ అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని బడి మసీదు ప్రాంతం సమీపంలో యూపీహెచ్సీ తుకారంగేట్ , బిఆర్ఎస్ నాయకులు...
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం
శంషాబాద్ లో గులాబీ నేతల అరెస్టు
పెంచిన ఫీజులు తగ్గించాలి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం