రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
మేడ్చల్ క్యాబేజీ మాటున భారీ స్మగ్లింగ్...
* డిసిపి కోటిరెడ్డి ఉక్కు పాదం

* విజయవంతమైన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.
* మహారాష్ట్రకు తరలిస్తుండగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద పట్టుబడిన కిలాడీలు.
మేడ్చల్ ఏప్రిల్ 4 (నగర నిజం): రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న నకిలీ విత్తనాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీసుల కళ్లు గప్పేందుకు క్యాబేజీ లోడ్ ముసుగులో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు కోటి రూపాయల విలువైన నిషేధిత బీజీ-III (BG-III) పత్తి విత్తనాలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ (SOT) బృందం, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్ కాగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు.
రూ.38 లక్షల సొత్తు సీజ్..
విశ్వసనీయ సమాచారం మేరకు ఏప్రిల్ 3న మేడ్చల్ ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ 6 సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన ఏపీ 39 వీఈ 4038 నంబరు గల మహీంద్రా బొలెరో వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయింది. పైన క్యాబేజీ సంచులను కప్పి, వాటి కింద దాచిన ఏకంగా 3000 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ. 30,00,000 ఉంటుందని అంచనా. రవాణాకు ఉపయోగించిన రూ. 8,00,000 విలువైన బొలెరో వాహనంతో కలిపి మొత్తం రూ. 38 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కర్నూల్ టు నాగ్‌పూర్.. రూ. 30 వేల కోసం కక్కుర్తి...
కర్నూలు జిల్లా కోస్గి మండలానికి చెందిన ప్రధాన సరఫరాదారు మగులూరి సాంబశివరావు ఈ దందాకు మాస్టర్ మైండ్. పత్తి విత్తనాలను కర్నూలు నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు తరలించేందుకు అదే మండలానికి చెందిన బొలెరో వాహన యజమాని చేతుల నరసింహులుతో రూ. 30,000లకు బేరం కుదుర్చుకున్నాడు. డ్రైవర్ తలారి రమేష్‌తో కలిసి నరసింహులు ఈ సరుకును నాగ్‌పూర్ తరలిస్తుండగా.. ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు వారి ఆట కట్టించారు. వాహన యజమాని నరసింహులు, డ్రైవర్ రమేష్‌లను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సాంబశివరావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
డీసీపీ కోటిరెడ్డి మార్క్ ఆపరేషన్.. పాత నేరస్థులపై నజర్**
పరారీలో ఉన్న సాంబశివరావు, పట్టుబడిన నరసింహులు ఇద్దరూ పాత నేరస్థులే కావడం గమనార్హం. గతంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ విత్తనాల కేసులోనూ (Cr.No. 118/2025) వీరు నిందితులుగా ఉన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం వల్లే ఈ భారీ స్మగ్లింగ్‌ను అడ్డుకోగలిగామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ బృందాన్ని, మేడ్చల్ పోలీసులను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై సెక్షన్ 318(4) BNS, ఈసీ చట్టం సెక్షన్ 7, విత్తనాల చట్టం-1966 సెక్షన్ 19, ఈపీ చట్టం-1986 సెక్షన్ 15(1) కింద మేడ్చల్ పీఎస్‌లో కేసులు (Cr.no. 294/2026) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author
Related Posts
Post Your Comment

Comments