ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఇబ్రహీంపట్నం, మే 12 (నగరనిజం) : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాల ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు చేరుటకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల కోడ్ (12038)తో దోస్త్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, మొదటి వెబ్ ఆప్షన్ గా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ఎంపిక చేసుకోవాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలలో బిఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్, డెయిరీ సైన్స్ మరియు క్రాప్ ప్రొడక్షన్), బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్), లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పిహెచ్. డి, నెట్, సెట్ మొదలైన అత్యున్నత విద్యార్హత కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన జరుగుతోందని, ఎన్ఎస్ఎస్, కెరీర్ గైడెన్స్, పీజీ ఎంట్రన్స్ కోచింగ్ మొదలైన శిక్షణ తరగతులతో విద్యార్థులు తమ భావి జీవితానికి బంగారు బాటలు వేస్తున్న కళాశాలకు విద్యార్థులు మొదటి ఆప్షన్ ఇవ్వాలని కోరారు. ఈనెల 21 వరకు ఆన్లైన్లో రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆప్షన్లు ఈనెల 22 వరకు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. తొలిదశ సీట్ల కేటాయింపు 29న జరగనుండగా, సెల్ఫ్ రిపోర్టింగ్ మే 30 నుంచి జూన్ 9 వరకు చేసుకోవచ్చు అన్నారు. వివరాలకు చరవాణి నంబర్లు 8919996725, 9441705076, 938106920 లలో సంప్రదించాలని సూచించారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments