ముసుకు వేయని అధికారులు...

ముసుకు వేయని అధికారులు...

ఎల్లంపేట్ మున్సిపాలిటీ:-పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం పదే పదే చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అధికారులు చెప్పడం వరకే కానీ, ఆచరణలో అమలు అవుతుందా లేదా అనేది పర్యవేక్షణ కరువైందని శిలాఫలకాల దిమ్మెలను చూస్తే తెలుస్తోంది. ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలును అధికారులు తుంగలో తొక్కుతున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా ఉన్న శిలాఫలకాల దిమ్మెలకు కోడ్ వర్తించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కేంద్రమైన నూతన్ కల్, కొనాయిపల్లి, లింగాపూర్,మైసిరెడ్డిపల్లి తో సహా పలు వార్డులలో శిలాఫలకాలు, మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లతో కూడుకున్నటువంటి,బల్లలు,ఓపెన్గానే కనిపిస్తున్నాయి. ఈ శిలాఫలకాలపై ఎమ్మెల్యేలు చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో పాటు స్థానిక నాయకుల పేర్లు కనిపిస్తున్నాయి. తొలుత ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హడావిడి చేసిన అధికారులు. కొన్నిచోట్ల మాత్రమే ఫ్లెక్సీలను తొలగించి, నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. కానీ శిలాఫలకాలపై మాత్రం దృష్టి సారించలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బహిరంగంగా కనిపిస్తున్న శిలాఫలకాల దిమ్మెలకు ముసుగులు వేయాలని పలువురు కోరుతున్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News