బోడజనంపేటలో స్వతంత్ర అభ్యర్థి రాజేందర్ సింగ్ మూడుసార్లు విజయ పరంపర

ఘనంగా సన్మానించిన రాజపుత్ సమాజం బంధువులు,బోడజనంపేట గ్రామ ప్రజలు

బోడజనంపేటలో స్వతంత్ర అభ్యర్థి రాజేందర్ సింగ్ మూడుసార్లు విజయ పరంపర

బోడజనంపేట, 03, ఫిబ్రవరి (నగర నిజం) : మహబూబ్ నగర్ జిల్లా బాల నగర్ మండలంలోని బోడజనంపేట గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఠాకూర్ రాజేందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా మూడుసార్లు విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇదే గ్రామంలో గతంలో ఆయన భార్య కూడా ఒకసారి సర్పంచ్ గా ఎన్నికై గ్రామాభివృద్ధికి ఎన్నో సేవలందించారు.ఈ వరుస విజయాలు గ్రామ ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు గెలుపొందడం అరుదైన విషయం అని స్థానికులు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసినందుకే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయన అభిమానులు రాజపుత్ సమాజం బంధువులు ఆయననే అభిమానించి సన్మానించారు.ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసం రాజేందర్ సింగ్ పై మరింత బలపడిందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఆయనకు ప్రజాసేవ చేసే మరిన్ని అవకాశాలు లభించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేసిన నాయకుడిగా ఆయనకు పేరు ఉందని తెలిపారు.సర్పంచ్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ తన విజయానికి గ్రామ ప్రజలే కారణమని స్పష్టం చేశారు. రాజ్ పుత్ సమాజం నుంచి అపూర్వమైన సహకారం లభించిందని తెలిపారు. బోడజనంపేట గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా వసతుల మెరుగుదల కోసం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.ఈ సన్మాన కార్యక్రమంలో రాజ్ పుత్ సమాజం తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ ఉపేంద్ర సింగ్ చౌహన్, శుక్ రాజ్ సింగ్, మహేందర్ సింగ్, రవీందర్ సింగ్, హరిందెర్ సింగ్, జగదీప్ సింగ్, రాకేష్ సింగ్, వెంకట్ రెడ్డి, రాజ్ కుమార్ సింగ్ ,బుద్ధు సింగ్, రాజ్పుత్ సమాజం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-02-03 at 8.22.16 PM

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News