సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం

రిజిస్ట్రేషన్ లేకుండా క్రీడాలల్లో పాల్గొనే అవకాశం లేదు:- ఎంఈఓ శంకరయ్య

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం

మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మేడ్చల్ ప్రాంగణంలో తేదీ: 28/01/2026 నుండి 31/01/ 2026 వరకు నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శంకరయ్య పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ సీఎం కప్ లో భాగంగా నిర్వహించే క్రీడలు క్యారమ్స్, చెస్, వాలీబాల్, కబడ్డీ మరియు కోకో క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తారని.పై ఐదు క్రీడాంశాలలో ఆసక్తిగల యువతి యువకులు, విద్యార్థినీ విద్యార్థులు తమ పేర్లను htt://satg.telangana.gov.in ఆన్లైన్ లింకు ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని. రిజిస్ట్రేషన్ లేకుండా పాల్గొనే అవకాశం లేదని అన్నారు.సీఎం కప్ మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి పోటీలకు సంబంధించిన సమాచారం నరేందర్ పిటి ని ఫోన్ నెంబర్ 8897583354,ద్వారా సంప్రదించాలని ఈ రోజు సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్బంగా మేడ్చల్ మండల విద్యాధికారి పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

 

 

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం