సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
విజేతగా నిలిచిన మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం
ఎల్లంపేట మున్సిపాలిటీ :-సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని బర్మాజిగూడలో గల యుక్త క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ ప్రెస్ క్లబ్, పొలిటికల్ లీడర్స్ టీమ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది పొలిటికల్ లీడర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 8 ఓవర్ల మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో పొలిటికల్ లీడర్స్ టీం 8 ఓవర్లలో 40 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోగా. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి క్రికెట్ టోర్నీలో కేవలం గెలుపు ఓటములు మాత్రమే కాకుండా మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, మేడ్చల్ పొలిటికల్ లీడర్స్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment


Comments