ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
ఆనందంగా ముగియవలసిన ట్రోఫీ అల్లకల్లోలంగా మారింది.
ఎల్లంపేట్ మున్సిపాలిటీ:- మున్సిపల్ పరిధిలోని బర్మాజి గూడలో గల యుక్తా గ్రౌండ్ లో 28 క్రికెట్ టీం లతో ప్రారంభమైన సీఎంఆర్ ట్రోఫీ ఆదివారం రోజు ఫైనల్ కు చేరుకుంది. అయితే ఇక్కడే వివాదం మొదలైంది ఆటగాళ్ల అర్హతపై వివాదం క్రీడా మైదానాన్ని అల్లకల్లోలంగా మార్చింది. మొదట డబిల్ పూర్-బి జట్టు ఫైనల్ కి చేరగా, ఆదివారం జరిగిన సెమీఫైనల్ లో డబిల్ పూర్-ఎ, శ్రీరంగ వరం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రీరంగవరం జట్టు ఓడిపోయింది. ఓటమి అంగీకరించని శ్రీరంగవరం జట్టు తమ ఓటమి కి ప్రత్యర్థి ఆటగాళ్లే కారణమని తీవ్ర ఆరోపణలు చేసింది. ఫైనల్ కి ముందు డబిల్ పూర్ -ఏ జట్టులో బయటి నుంచి తెచ్చిన ఆటగాడు ఆడుతున్నాడంటూ అభ్యంతరం వ్యక్తమైంది. ఆధార్ కార్డు చూ పించాలని డిమాండ్ చేయడంతో మ్యాచ్ ఘర్షణగా మారింది. రీ మ్యాచ్ ఇవ్వాలంటూ మైదానంలోనే నిరసనకు దిగారు శ్రీగంగవరం టీం మైదానం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే కార్యక్రమానికి హాజ రైన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పరిస్థితి చక్కబెట్టేందుకు ప్రయత్నించిన కుదరలేదు. దీంతో మల్లా రెడ్డి మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. టోర్నమెంట్ నిర్వహించే నిర్వాహకులు ఎవరు ఎక్కడినుండి పాల్గొంటున్నారు అన్న విషయం ముందస్తుగా తెలుసుకోకపోవడమే వివాదాలకి దారితీసిందని క్రీడాకారులు అన్నారు ఉత్సవంగా ఉండాల్సిన టోర్నమెంట్ మధ్యలో ఆగిపోవడంతో. స్థానికంగా చర్చనీయాంశ మైంది.
About The Author
Related Posts
Post Your Comment


Comments