బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరా బాదరగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని చూస్తుండడంతో ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ల విషయమై బిసి లకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ మున్సిపల్ నాయకుల ఆధ్వర్యంలో కమీషనర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మున్సిపాలిటీలో ఎస్టి లకు జనాభా ప్రాతిపదికన 5,ఎస్సీ లకు జనాభా ప్రాతిపదికన 4, నాలుగు వార్డులు కేటాయించి బిసి లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ ప్రాతిపదికన కేవలం 3, వార్డులు కేటాయించడంతో బీసీ లకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ లోనే మొత్తం జనాభా లో అత్యధిక శాతం ఉన్నటువంటి బిసి లకు ప్రాతినిత్యం లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికైనా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికారులు స్పందించి మరోసారి పరిశీలన చేసి బిసి లకు న్యాయం జరిగేలా చూడాలని లేనియెడల కోర్టు ద్వారా న్యాయపరంగా తెచ్చుకునేలా ప్రయత్నం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు జగన్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచ్ పోచయ్య ముదిరాజ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు కంచుగట మహేష్, దాది ప్రకాష్, కార్యదర్శి ఉషిగారి బాబు, రాజేష్, బాలకృష్ణ, సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యులు జిన్నారం కృష్ణ, రవిచంద్ర మాజీ సొసైటీ డైరెక్టర్ జీడిపల్లి భూపాల్, సీనియర్ నాయకులు చిర్మనీ రవిందర్ ముదిరాజ్, సత్యనారాయణ రవిబాబు, బాలకృష్ణ, అంజయ్య, నాగేష్ ముదిరాజ్, గిరిచారీ, చుంచు నాగేష్ తదితరు నాయకులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం