ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మల్లారెడ్డి పర్యటన
మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
Views: 72
On
ఎల్లంపేట్ మున్సిపాలిటీ:- ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ దివాలా రాష్ట్రంగా మారుస్తోందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట, లింగాపూర్ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు భారీ మెజార్టీతో గెలుపొంది చైర్మన్ పీఠం దక్కుంచుకుకోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బత్తుల కృష్ణ, వరిగంటి నాగులు తదితరులు బీ.ఆర్.ఎస్ లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్,అకిటి నవీన్ రెడ్డి,సద్ది సురేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ లక్ష్మీ సంజీవ,కవిత జీవన్, నాయకులు.. రాజమల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, పెంటయ్య, రాగజ్యోతి, మోహన్ రెడ్డి, సంజీవ, యూనిస్ పాష తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Post Your Comment

Latest News
03 Feb 2026 21:27:03
*Bodajanampet, February 3 (Nagara Nijam):*Independent candidate Rajender Singh has achieved a rare distinction by winning the Sarpanch election for the...

Comments