కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం

చెరువులో జారీపడి ఇద్దరు పిల్లలు మృతి

కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం

మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం

మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి చేరుకుని గాలింపు చేపట్టారు . ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహాలు దొరకకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మహేశ్వరం రెస్క్యూ టీం ఎంతోపాటు మహేశ్వరం కానిస్టేబుల్ శ్రీను చెరువు లోపలికి దిగి రిషి (6) బద్రీనాథ్ (8) మృతదేహాలను వెలికి తీశారు. దీంతో చెరువు సమీపంలోనే ఉన్న ఆ పిల్లల తల్లులు తమ కొడుకులు విగత జీవులుగా బయటకి రావడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లులకు ఒక్కొక్కరే కొడుకులు ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.

IMG-20260202-WA0055

02 Feb 2026 05:17 PM
తెలంగాణ క్రైమ్ రంగారెడ్డి

www.nagaranijam.com 02 Feb 2026 05:17 PM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన
ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర...
అర్చన శ్రీనివాస్ చేత వధువుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం
పచ్చని భూములు పిచ్‌లుగా… అధికారుల మౌనం వెనుక రహస్యం!
హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క సీఎస్ఆర్ స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖా మంత్రి డి. శ్రీధర్ బాబు
మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
అడ్వకేట్‌పై పోలీస్ ప్రవర్తనపై ఆగ్రహం
ప్రజ్ఞాపూర్ లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు