మధురై హైకోర్టు సంచలన తీర్పు…
9 మంది పోలీసులకు మరణశిక్ష
మధురై, ఏప్రిల్ 6 (నగర నిజం) : తమిళనాడులో సంచలనం సృష్టించిన జయరాజ్–బెనెక్స్ లాకప్ మృతి కేసులో మధురై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది.2020లో లాక్‌డౌన్ సమయంలో జయరాజ్, అతని కుమారుడు బెనెక్స్ తమ మొబైల్ దుకాణాన్ని నిర్ణయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచినట్లు ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో తీవ్ర చిత్రహింసలకు గురిచేయడంతో ఇద్దరూ మరణించిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది.ఈ ఘటనపై విచారణ కొనసాగగా, సంబంధిత పోలీసులపై హత్య, దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలు నిరూపితమయ్యాయి. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థపై మరోసారి చర్చ మొదలైంది. కస్టడీ మరణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మళ్లీ గుర్తు చేసింది.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments