పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం

తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.ఈ శిబిరంలో భాగంగా నిపుణులైన వైద్య బృందం ద్వారా ఎముకలు, కీళ్ల సంబంధిత పరీక్షలు నిర్వహించగా, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు, చక్కెర స్థాయిలు పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వైద్య సూచనలు అందిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం, చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలను గుర్తించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.అలాగే పాఠశాలలో చేరాలనుకునే కుటుంబాలకు ఈ శిబిరం ఒక మంచి అవకాశం కల్పించిందని తెలిపారు. వారు పాఠశాల వాతావరణాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం పొందారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్య బృందానికి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

09 Apr 2026 09:15 AM
సికింద్రాబాద్

www.nagaranijam.com 09 Apr 2026 09:15 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
తిరుమలగిరి, 09 ఏప్రిల్ (నగర నిజం) :విద్యార్థుల విద్యాభ్యాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా వైద్య...
మధురై హైకోర్టు సంచలన తీర్పు…
*సామాజిక సంస్కర్త బాబు జగ్జీవన్‌రామ్‌*
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ చొరవతో
రూ.30,లక్షల విలువైన నిషేధిత పత్తి విత్తనాలు పట్టివేత!
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం