పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్

పోస్ట్ పెట్టిన యువకుడి పై భగ్గుమన్న శంషాబాద్ వాసులు 

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్

IMG-20250510-WA1438పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకుడి పై భగ్గుమన్న శంషాబాద్ వాసులు 

శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఆర్జిఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

ఇన్స్టాలో విద్వేషాలు రగిల్చేలా పోస్ట్ పెట్టిన యువకుడు పాల్మాకుల్ వాసిగా గుర్తింపు 

కేసు నమోదు చేయాలంటూ శంషాబాద్ రూరల్ పిఎస్ వద్ద స్థానికులు ఆందోళన

పోలీసుల అదుపులో నిందితుడు....?

రాజేంద్రనగర్, మే 11 IMG-20250510-WA1440IMG-20250510-WA1439(నగరనిజం ప్రతినిధి): భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కు మద్దతు పలుకుతూ విద్వేషాలు రగిల్చేలా ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ శంషాబాద్ లో అగ్గి రాజేసింది. పాకిస్తాన్ కు మద్దతుగా ఓ వర్గానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో ఆగ్రహించిన స్థానికులు.....నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..... సోషల్ మీడియాలో విద్వేషాలు రగిలించేలా పోస్ట్ పెట్టిన యువకుడు శంషాబాద్ మండలం లోని పాల్మాకుల్ గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పాల్మాకుల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు భారత్ - పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో

ఇన్స్టా వేదికగా పాకిస్తాన్ కు మద్దతుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన స్థానికులకు కోపం కట్టలు తెచ్చుకుంది. పార్టీలకు అతీతంగా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న చెరుకున్న శంషాబాద్ వాసులు.... పాకిస్తాన్ కు మద్దతుగా విద్వేషాలు రగిలించేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నిందితుడి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసి దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులతో వాదనకు దిగారు.దీంతో శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. 

ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందుత్వవాదులు 

మరోవైపు పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో విద్వేషాలు రగిలించేలా పోస్ట్ పెట్టిన నిందితుడి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు శంషాబాద్ కు చెందిన హిందుత్వవాదులు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శంషాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్,బీఆర్ఎస్ సీనియర్ నేత కొనమొల్ల శ్రీనివాస్, స్థానిక నేతలు మురళి గౌడ్, కృష్ణ, శంషాబాద్ ఆలయాల పరిరక్షణ కమిటీ నేతలు కోడూరు ఉదయ్ కిరణ్, నరసింహ గౌడ్ తదితర నేతలు ఇన్స్పెక్టర్ బాలరాజును కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన యువకుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్
పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన యువకుడి పై భగ్గుమన్న శంషాబాద్ వాసులు  శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఆర్జిఐఏ పోలీసులకు...
బాటసింగారంలో శ్రీశ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశ్వకర్మ జేఏసీ ఏర్పాటు సమావేశాన్ని జయప్రదం చేయండి!
వీర జవాన్ మురళి నాయక్ నివాళులర్పించిన సిపిఐ నాయకులు
భారత సైనికుడు మురళి నాయక్ నివాళులర్పించిన
అల్కాపురి కాలనీలో లక్ష్మీస్ హెయిర్ సెలూన్ అండ్ అకాడమీ ప్రారంభం