కర్మన్ ఘాట్ లో ఘనంగా సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్, అంజలి మేకప్ అకాడమీ ప్రారంభం
ముఖ్యఅతిథిగా హాజరై సెలూన్ ప్రారంభించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
కర్మన్ ఘాట్ డివిజన్ పరిధి భూపేష్ గుప్తా నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిజర్స్ టాక్ యూనిసెక్స్ సెలూన్ & అంజలి మేకప్ అకాడమీ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్ ఏర్పాటు చేసిన సెలూన్ & అకాడమీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్ లో పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. కర్మన్ ఘాట్ లో షాపు ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. నిర్వాహకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని శాలువాలు కప్పి సన్మానించారు.. ఈ సందర్భంగా నిర్వాహకులు లక్ష్మిశెట్టి మనోహర్, అంజలి, శ్యామ్, చంద్ర గోపాల్..బ్యూటీషియన్ రంగంలో తమకు అపార అనుభవం ఉందని, భూపేష్ గుప్తా నగర్ లో తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్త్రీ, పురుషులకు ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు. హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్ కట్‌లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్‌మెంట్లు, ఎక్స్‌టెన్షన్‌లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కంచర్ల శివారెడ్డి, నారగోని నారగోని శ్రీనివాస్ యాదవ్, చందు, సురేష్, శ్రీధర్, జంగన్న, భాను, వెంకటేష్, బిషప్ ప్రేమ్ రాజ్, పాస్టర్లు డేవిడ్, ఆంధ్రయ్య, సుధాకర్, డేనియల్, రాజేష్, బంధుమిత్రులు, స్థానిక నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్