అనాధలుగా ప్రకటించబోయే చిన్నారులు – తల్లిదండ్రులు 30 రోజుల్లో సంప్రదించగలరు
రంగారెడ్డి/ నగర నిజం : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రంగారెడ్డి జిల్లా మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు గృహ, బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉంచబడిన కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులు లేకుండా ఉన్నారని తెలిపారు. వీరు తాత్కాలికంగా రక్షణ నిమిత్తం కేంద్రాల్లో ఉంచబడినారని పేర్కొన్నారు.ఈ చిన్నారులకు సంబంధించి తల్లిదండ్రులు లేదా బంధువులు ఉంటే, వారు ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుంచి 30 రోజుల్లోగా తగిన ఆధారాలతో జిల్లా సంక్షేమ అధికారిని సంప్రదించాలని సూచించారు. నిర్ధారిత గడువు వరకు ఎవరూ ముందుకు రాకపోతే, సంబంధిత చిన్నారులను అనాధలుగా ప్రకటించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం దత్తతకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.దత్తత తీసుకోవాలని ఆసక్తి ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ www.cara.nic.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్