అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ

కుంట్లూరు నుంచి భూదాన్ కాలనీ దారిలో షెడ్డు నిర్మాణం

 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ

IMG_20250503_140751పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిపోయిందని స్థానికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మూల చూసినా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించబడుతుండడం, వాటిపై అధికారులు మౌనమే మేనిఫెస్టోగా నిలిపినట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.కంటికి కనిపించేలా కుంట్లూర్ ప్రాంతంలో ఒక షెడ్డు నిర్మాణం జరుగుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగం ఏమాత్రం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న  ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు, అధికారుల నిర్లక్ష్యమే ఈ అక్రమాలకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కమిషనర్‌, టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇకనైనా ప్రభుత్వం కలుగజేసి, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటేనే మున్సిపాలిటీ పరిపాలన పట్ల ప్రజల్లో నమ్మకం నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

ఈటల రాజేందర్ మానవత్వం చాటారు ఈటల రాజేందర్ మానవత్వం చాటారు
ఈటల రాజేందర్ తన ఇంటికి వెళ్తున్న సమయంలో షామీర్ పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడిపోతూ...
ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ప్రతినిధులకు హామీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్
రామకృష్ణ నృత్య మందిర్ 5వ వార్షికోత్సవ వేడుకలు
బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
 (10 శనివారం) కీసర ప్రాంతాల్లో విద్యుత్  అంతరాయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు