తుర్కయంజల్ కమాన్ వద్ద విజయోత్సవ సంబరాలు
హస్తినాపురం టౌన్‌లోని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు పహలగం లో భారతీయులపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి ప్రతిగా భారత ఆర్మీ చేపట్టిన "ఆపరేషన్ సింధు"కు మద్దతుగా తుర్కయంజల్ కమాన్ వద్ద విజయోత్సవ సంబరాలు చేశారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ హస్తినాపురం టౌన్ కార్యదర్శి అనిమల్ల నితిన్ మాట్లాడుతూ – విదేశాల్లో భారతీయులపై దాడులను కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలతో సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని, భారత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ దేశ గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న సాహసోపేతమైన అడుగుగా అభివర్ణించారు. కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని భారత్‌మాతకు జయకారాలు వేస్తూ, జాతీయజెండాలు ప్రదర్శించారు.ఇలాంటి సంఘటనలపై ప్రపంచం స్పందించాల్సిన అవసరం ఉందని, భారతీయుల భద్రతకు కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్