పెద్ద షాపూర్ లో మహిళ అనుమానాస్పద మృతి
ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హారిక
హారిక మృతి పట్ల కుటుంబ సభ్యుల అనుమానంఅనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ పోలీసులు
రాజేంద్రనగర్, (నగరనిజం ప్రతినిధి):రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. బదండ్ల హారిక (25) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు వరకు శంషాబాద్ రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పిల్లోని గూడ గ్రామానికి చెందిన హారిక అలియాస్ లక్ష్మి కి పెద్ద షాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. వీరికి ప్రస్తుతం ఇద్దరు సంతానం ఉన్నారు. ఈనెల 6 వ తేదీన ఇంట్లో ఏం జరిగిందో తెలియదు గానీ హారిక ఉన్నట్లుండి స్పృహ తప్పి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే హారిక మృతిపై ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హారిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేందర్ రెడ్డి వెల్లడించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్