ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభం 

ఆర్కే పురంలో ఘనంగా లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభం 

కొత్తపేట్ డివిజన్ ఆర్కే పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి ఏర్పాటుచేసిన సెలూన్ & అకాడమీ ప్రారంభోత్సవానికి బిజెపి సీనియర్ లీడర్ సామ రంగారెడ్డి, ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, చిలుక ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అల్కాపురిలో లక్ష్మీస్ సెలూన్ & అకాడమీ ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగెల్లి నగేష్, లక్ష్మి మాట్లాడుతూ..బ్యూటీషియన్ రంగంలో తమకు 18 సంవత్సరాల అనుభవం ఉందని, ఆర్‌కె పురంలోని అల్కాపురి కాలనీలో తమ శాఖను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద ట్రెండీ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు.హెయిర్ కేర్, స్కిన్ కేర్, మేకప్ మరియు ఈస్తటిక్ ట్రీట్మెంట్లలో ప్రీమియం సేవలను అనుభవజ్ఞులైన, సుశిక్షితులైన సిబ్బందితో అందిస్తున్నామన్నారు. హెయిర్ ఫారమ్స్ మరియు హెయిర్ కలరింగ్, హెయిర్ స్టైలింగ్, మానిక్యూర్, బ్రైడల్ మేకప్, హెయిర్ గ్రూమింగ్ వంటి గ్రూమింగ్ సేవలు ఉన్నాయి.కస్టమర్ వయస్సును బట్టి ఫేషియల్స్ అందించడంతో పాటు, సెలూన్ హెర్బల్స్ మరియు ఫ్రూట్స్, రోజ్ పెటల్ మరియు సైంటిఫిక్ స్ట్రోక్ ఫేషియల్స్ ఉపయోగించి ఫేషియల్ సేవలను అందిస్తామన్నారు. ఆధునిక, లగ్జరీ సౌకర్యాలతో పాటు, బ్లష్ హెయిర్‌ కట్‌లు, కలర్, టెక్స్చరైజింగ్ సేవలు, షాంపూలు, బ్లో డ్రైలు, ఫార్మల్ స్టైలింగ్, కండిషనింగ్ ట్రీట్‌మెంట్లు, ఎక్స్‌టెన్షన్‌లు మరియు హెయిర్ రిమూవల్ సేవలతో పాటు షాంపూ, కండిషనింగ్ మరియు వాక్సింగ్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు. తమ వద్ద అందుబాటు ధరలలో అత్యాధునికమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఔత్సాహిక బ్యూటీషియన్లు మరియు మేకప్ ఆర్టిస్టులను పెంపొందించే లక్ష్యంతో అందం మరియు వెల్నెస్‌లో ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల సేవలపై 30% తగ్గింపు ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరిసర ప్రాంతాల మహిళలు, యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాలకు.9703986490 నెంబర్ లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది, బంధుమిత్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత