భారత సైనికుడు మురళి నాయక్ నివాళులర్పించిన
హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్న గొని రవీందర్ గౌడ్
హయత్ నగర్ / నగర నిజం: . మన భారతీయ సైనికుడు మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్‌కు క్యాండిల్‌లతో నివాళులర్పించే కార్యక్రమం హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నగౌని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సీనియర్ నాయకురాలు కళ్లెం సుజాత, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాము నాయక్, ప్రకాష్, మాడుగుల చరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రెటరీ మనోజ్ కుమార్, మహిళా నాయకురాలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మురళి నాయక్‌కు నివాళులర్పించారు.ఈ సందర్భంగా “అమర్ రహే మురళి నాయక్”, “జోహార్ మురళి నాయక్” అంటూ నినాదాలు చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్