సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సిలో మార్కుల ప్రభంజనం lotus lap school
స్టేట్ మూడవ ర్యాంక్ సాధించిన విద్యార్థిని జి. శ్రీజ రెడ్డి
సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సి లో మార్కుల ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్ల క్రితం స్థాపించిన లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ లో ఎస్ఎస్సి ఫలితాల్లో వేలాదిమంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ఆ విద్యార్థులు ప్రపంచ దేశాలలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు గర్వపడుతూ 2024- 25 సంవత్సరంకు గాను 10వ తరగతిలో విద్యార్థిని శ్రీజా రెడ్డి 594 మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఎస్. లక్ష్మీ భవాని 587 మార్కులు, ఎస్. సాస్య 583 మార్కులు, ఎ. జాహ్నవి 581, ఆర్. అక్షయ 580 మార్కులు, జి గాయత్రి దేవి 560 మార్కులు సాధించారు. పాఠశాలకు 100% ఉత్తీర్ణత లభించింది. ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ చైర్మన్ కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైన 594 మార్కులు సాధించిన విద్యార్థిని శ్రీజా రెడ్డికి అదే స్థాయిలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.
గత 25 ఏళ్ల నుండి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్, కర్మన్ ఘాట్, బడంగ్పేట్ బ్రాంచిలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలు కలిగినటువంటి విద్యను బోధిస్తూ, సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని సూచించడానికి టెక్నాలజీకి అనుగుణంగా ఉత్తమమైన శిక్షణ అందిస్తూ వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.
అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ కడారి మాధవి మాట్లాడుతూ ఈ ఫలితాలు ఈ విధంగా రావడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. తదనంతరం అకాడమిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజా రెడ్డి మాట్లాడుతూ 2024- 25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించినందుకు శ్రీజా రెడ్డికి అభినందనలు తెలిపారు. మిగతా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, అంకితభావంతో విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. తర్వాత
విద్యార్థిని శ్రీజ రెడ్డి మాట్లాడుతూ తనను మా తల్లిదండ్రులు ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పాఠశాలలో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివించినందుకు గాను ఈ ఉత్తమమైనటువంటి ఫలితం నాకు లభించిందని భవిష్యత్తుకు నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహకరించిందని పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ లో ఎంసెట్లో మంచి మార్కులు సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాలనేదే తన అభిలాష అని తెలిపారు.
స్టేట్ మూడవ ర్యాంక్ సాధించిన విద్యార్థిని జి. శ్రీజ రెడ్డి
#lotus lap public school
#saroor nagar
#ssc results
#10 th results
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్