మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ

మహిళలకు అండగా షీ టీమ్స్‌: రాచకొండ సీపీ

IMG-20250508-WA1476రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్‌ కీలకపాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో 188 మంది మహిళలను, బాలికలను వేధించినవారిని పట్టుకున్నట్టు తెలిపారు. బస్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు తదితర బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో షీ టీమ్స్‌ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని వివరించారు.రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. 132 మంది మేజర్లు, 56 మంది మైనర్లను పట్టుకుని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. గత నెల 1 నుండి 30 వరకు 225 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిలో 26 ఫోన్ల ద్వారా, 77 సోషల్ మీడియా ద్వారా, 122 నేరుగా వేధించిన ఘటనలుగా నమోదు అయ్యాయి. మొత్తం 14 క్రిమినల్ కేసులు, 92 పెట్టి కేసులు నమోదయ్యాయి.

ప్రధాన కేసులు:

  • ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తన పరిచయస్తుడి నమ్మకంతో వెళ్తుండగా, అతను బలవంతంగా ఓ హోటల్‌కి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆమె ప్రత్యర్థన చేసి తప్పించుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
  • టెలిగ్రామ్ ద్వారా అసభ్యంగా మెసేజ్‌లు పంపిన నిందితుడిని అరెస్ట్ చేశారు.
  • ప్రేమను నిరాకరించిన యువతిపై ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించిన నిందితుడిపై కేసు నమోదు చేశారు.
  • మరో యువతిని ప్రేమించమంటూ వేధించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
  • బస్టాండ్ వద్ద న్యూసెన్స్‌కు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసులు పెట్టారు.

అవగాహన కార్యక్రమాలు:
గత నెలలో 93 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 17,420 మందికి మహిళా హక్కులు, చట్టాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మెట్రో రైళ్లలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మహిళా కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన తొమ్మిది మంది పురుషులపై జరిమానా విధించారు.మహిళలు వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్స్‌ వాట్సాప్ నంబర్ 8712662111కి ఫిర్యాదు చేయాలని సూచించారు. భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రాహింపట్నం, కుషాయిగూడ, ఎల్బీ నగర్, మల్కాజిగిరి, వనస్థలిపురం ప్రాంతాల షీ టీమ్స్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.ఈ కార్యక్రమంలో విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి. ఉషా రాణి, ఇన్స్పెక్టర్లు ఎం. ముని, జె. హనుమంతు, జి. అంజయ్య, ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.ఇలాంటి వేధింపులపై మహిళలు భయపడకుండా స్పందించాలని అధికారులు కోరారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత