వీర జవాన్ మురళి నాయక్ నివాళులర్పించిన సిపిఐ నాయకులు
అబ్దుల్లాపూర్ మెట్టు / నగర నిజం: దేశం కోసం చిన్న వయసులో పాకిస్తాన్ తో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళి నాయక్ కు జోహార్లు జోహార్లని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి అన్నారు. రావి నారాయణరెడ్డి కాలనీ ఫేస్ 3 లో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి గారు, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాది రెడ్డి గార్లు మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉంటుందని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు మరణానికి కారకులైన పాకిస్తాన్ ప్రేరిత టెర్రరిస్టులను అంతముందించి విముక్తి కల్పించాలని అప్పుడే అమరులైన వీర జవాన్లకు నిజమైన నివాళ్ళని అన్నారు పాకిస్తాన్ పేరేపిత టెర్రరిస్టులను అంతం చేయాలని డిమాండ్ చేశారు జరిగే యుద్ధంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని వీర జవాన్లకు పౌరులకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. జై జవాన్ భారత్ మాతాకీ జై జైహింద్ అని నినాదం చేశారు.ఈ కార్యక్రమంలో... రైతు సంఘం మండల జిల్లా నాయకుడు, మాధవరెడ్డి, ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ అజ్మీర హరి సింగ్ నాయక్, పొన్నాల యాదగిరి, వట్టి నవనీత, సైదులు ముదిరాజ్, వినోద్ నాయక్, ఆవుల యాదగిరి, వీరేష్,గణేష్ నాయక్, గోపి, పాండు, దేవమ్మ, వెంకట్, రాములు, సోమేష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్