కర్నూలు జిల్లా కోర్టులో సంచలన తీర్పు – 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష
కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రాజకీయ హత్యకేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితులపై కోర్టు తీర్పు వెల్లడించింది.మొత్తం 16 మంది నిందితులపై విచారణ కొనసాగగా, వారిలో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది. మిగిలిన ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు నేరుగా రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నదిగా నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చకు దారితీసింది.చెరుకులపాడు నారాయణరెడ్డి పత్తికొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడిగా పనిచేశారు. హత్య జరిగిన తర్వాత పోలీసులు కేసును దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వివిధ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నేడు తుది తీర్పును ప్రకటించింది.ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరిగిందని న్యాయవాదులు భావిస్తున్నారు. నిందితులకు యావజ్జీవ శిక్ష విధించిన తీర్పుతో జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్