ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

రంగారెడ్డి జిల్లా : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా మంగళవారం కొందుర్గు మండలం ఉతరస్పల్లి, గ్రామంలో నిర్వహించిన సదస్సులో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్థానిక శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ తదితర వాటిని సందర్శించి, రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. సదస్సులో  భేటీ అయ్యి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా భూభారతి విధివిధానాల గురించి, చట్టంలో పొందుపర్చిన అంశాలపై అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మీదట నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన కొందుర్గు మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు ముగిశాక, జిల్లాలోని మిగితా మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో షాద్ నగర్ ఆర్డీఓ సరిత, సంబంధిత తహశీల్దార్లు, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత