గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య
మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం, మే 10 ( నగరనిజం ) : ఇబ్రహీంపట్నం గురునానక్ యునివర్సిటీ హాస్టల్ లో దారుణం చోటుచేసుకుంది. గురునానక్ యునివర్సిటీ కాలేజ్ కి చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, కురణవెల్లి గ్రామానికి చెందిన అల్లూరి శశిరెడ్డికి ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. కుమార్తె అల్లూరి భావన ( 22 ) గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మరో అమ్మాయి జూబ్లీహిల్స్ లో బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. అయితే శనివారం ఉదయం 10 గంటలకు తాను ఉండే హాస్టల్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంధి.