మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత

: GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

మేము మాటలు కాదు.. అభివృద్ధి చేస్తాం.. ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం – అభివృద్ధి మా బాధ్యత

మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న UGD ట్రంక్ లైన్ పనులను ఈరోజు వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తో కలిసి అంజలి రెసిడెన్సీ లో కొనసాగుతున్న పనులను GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక  కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు  పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం అంజలి రెసిడెన్సి లో నుండి వెళ్తున్న ట్రంక్ లైన్ పనులకు ఎలాంటి అడ్డంకులు కలిగించకుండా ముందుకు కొనసాగించాలని, కొనసాగుతున్న పనులలో సరైన లెవెల్స్ పాటిస్తూ పైప్లైన్ వేస్తున్నారని ఎక్కడైనా సమస్య వస్తే ప్రతినిత్యం స్వయంగా తానే పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు.పక్కన వెంచర్ కు సంబంధించిన డెవలపర్స్ వారితో మీ అందరి ముందే మాట్లాడడం జరిగిందని ఇంకా మిగతా లైన్లోకి సంబంధించిన పైపులైను తప్పకుండా వెంచర్ల నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని అన్నారు.. ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేందుకు ప్రయత్నించిన ఉపేక్షించేది లేదని హైడ్రా మరియు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని మళ్లీ ఫిర్యాదు చేసి ప్రభుత్వ స్థలాలను అన్యక్రాంతం కాకుండా కాపాడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సోమనాథ్,N.రవీందర్ రెడ్డి,సుధాకర్ గౌడ్,మురళి, అమరేందర్ రెడ్డి,శంకర్ రెడ్డి, రామ్ మోహన్ రావు,శ్రీహరి, కృష్ణ మోహన్, గోవర్ధన్ చారి,ఓంకార్ చారి,రామారావు మరియు బిజెపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత