ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతీ పుష్కరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానం అందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు.కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్‌లకు కూడా మంత్రి ఆహ్వానం అందించారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున భక్తులు రావొచ్చన్న అంచనాలతో నిర్వహణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈ సందర్భంగా పుష్కరాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలు కోరుతూ తగిన సూచనలు చేశారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్