మదనాపూర్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సమావేశం

వనపర్తి,మదనాపూర్, ఏప్రిల్ 14 (నగర నిజం) : మదనాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యాక్షన్ ప్లాన్ పై సమగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి రోడ్డు భద్రత కమిటీ, గ్రామ సభ కమిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశానికి ప్రత్యేక అధికారి ఎం.డి సీరజుద్దీన్ అహ్మద్ హాజరై మండల అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసన్న కుమారి, ఎంపీవో హుస్సైనప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, రోడ్డు భద్రత చర్యలు, గ్రామ సభల నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.

14 Apr 2026 09:44 AM
వనపర్తి

www.nagaranijam.com 14 Apr 2026 09:44 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News