మహేశ్వరం రెసిడెన్షియల్ పాఠశాల సందర్శించిన కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
సమస్యలపై తక్షణ నివేదికలు ఇవ్వాలని ఆదేశం
* హాస్టళ్లలో చిన్నపాటి మరమ్మతులకు శ్రీకారం… సంక్షేమ వారోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమం విజయవంతం
రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నగర నిజం): “ప్రజా పాలన - ప్రగతి ప్రణాలిక”లో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో మూడవ రోజు కార్యక్రమంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, భవనాలు, పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్ పరికరాలు, వంటగదులు, టాయిలెట్ బ్లాక్‌లు, స్నానాల గదులు తదితర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోపాలను గుర్తించారు. గుర్తించిన మరమ్మతు అవసరాలను నమోదు చేసి, ప్రాధాన్యత క్రమంలో అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనుల కోసం అంచనాలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపిస్తుండగా, ప్రైవేట్ భవనాల్లో ఉన్న వసతి గృహాల మరమ్మతులను ఈ నెల 24 నుంచి భవన యజమానులతో సమన్వయం చేసుకుని చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇదిలా ఉండగా, మహేశ్వరం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. శ్రీనివాస్ కలిసి సందర్శించారు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై తక్షణ నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల్లోని సమస్యలను గుర్తించి రిపోర్ట్ సిద్ధం చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లోనే చిన్నపాటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. అనంతరం పాఠశాల వంటశాల, మెస్, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రతపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందిస్తున్న కోచింగ్ వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, రాబోయే తరాలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, తహశీల్దార్, పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments