జనాభా లెక్కల్లో గందరగోళం – కురుమల ఆవేదన
సర్వే విధానంపై విమర్శలు, కుల గుర్తింపు లోపాలే కారణమని ఆరోపణలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 29 (నగర నిజం): ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో కురుమల జనాభా గణనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు కుండె వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సర్వేలో కురుమల జనాభా సుమారు 7.95 లక్షలుగా నమోదు కావడం వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. అసలు కురుమల జనాభా 30 లక్షలకుపైగా ఉండాల్సి ఉండగా, తక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణం సర్వేలో సరైన విధానం పాటించకపోవడమేనని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పలువురు తమ పేర్ల వెనుక “కురుమ” అనే గుర్తింపును నమోదు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కుల గుర్తింపుపై నిర్లక్ష్యం చూపుతున్న పెద్దల వైఖరిపై కుండె వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కులాన్ని స్పష్టంగా తెలియజేయకపోతే భవిష్యత్తులో హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక దొడ్డి కొమురయ్య ఆత్మభవనాన్ని నారాయణ పాఠశాలకు లీజుకు ఇవ్వడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లీజును వెంటనే రద్దు చేయాలని, లేకపోతే కురుమ సంఘం తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నిరాహార దీక్షలు చేయడానికైనా వెనుకాడమని స్పష్టం చేశారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments