హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

21 May 2025 10:49 AM
తెలంగాణ క్రైమ్ జిల్లా వార్తలు హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కల్వకుర్తి షాద్‌నగర్ ఎల్ బి నగర్ మహేశ్వరం రాజేంద్రనగర్ సెర్లింగంపల్లి

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

www.nagaranijam.com 21 May 2025 10:49 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం
మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్...
మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి
హయత్ నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ వేడుకలు
సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
ఉమ్మడి మేడ్చల్ నాయకుల నుంచి దేవేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు
క్యూలినారీ ఒలంపియాడ్ అంతర్జాతీయ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన చెఫ్ ముక్కెర దివ్య
మెడిసిటీ ఇన్స్టిట్యూట్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం