సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత
హయత్ నగర్ / నగర నిజం : సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద నమోదు అయిన కేసులో డీఎస్పీ కొండం పార్థ సారధి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. వీర రాఘవులుపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా మే 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ నివాసమైన దత్తాత్రేయ నగర్, బాగ్ హయత్ నగర్‌లో ఉన్న ఇంటిని ఏసీబీ సిటీ రేంజ్-2 టీమ్ సోదా చేసింది.సోదాల్లో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్ వంటి మందుగుండు సామాగ్రి అక్రమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ మురళీ మోహన్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు Cr.No: 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.ఇంతకుముందు సూర్యాపేటలోని ఒక డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ సంబంధించిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా 16 లక్షల లంచం అడిగిన ఘటనపై ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మందుగుండు సామగ్రి వెలుగు చూసినట్లు హయత్ నగర్ పోలీసులు , ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments