శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత ఘనంగా జయంతి ఉత్సవాలు
కొత్తపేట డివిజన్లోని న్యూ నాగోల్ వ్రిందావన్ బ్యాంకెట్ హాల్లో శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత జయంతి ఉత్సవాలు శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాత జయంతిని 2017 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 108 మంది స్త్రీలతో సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ హాజరై, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సేవా సమితిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి, సేవా సమితి అధ్యక్షుడు గుండా రామకోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బూశెట్టి సురేష్, ప్రధాన కార్యదర్శి పచ్చిపులుసు శ్రీనివాసరావు, కోశాధికారి మోట్కూరి రమేష్, సంయుక్త కార్యదర్శి పాపిశెట్టి మధు, ఆర్గనైజింగ్ సంయుక్త కార్యదర్శి కొండూరు వెంకటరమణ, కల్చరల్ సెక్రటరీ వీసంశెట్టి మురళి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్