ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు

ఎల్.బి. నగర్ చౌరస్తాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు

IMG-20250507-WA1504ఎల్.బి నగర్ చౌరస్తా వద్ద మన్సూరాబాద్ డివిజన్‌లో 'ఆపరేషన్ సింధూర్' విజయాన్ని పురస్కరించుకొని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. పాక్ ఉగ్రవాదులపై మన భారత సైనికులు ఇటీవల చేపట్టిన దాడికి మద్దతుగా ప్రతి భారత పౌరుడు నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చి, మిఠాయిలు పంచుకొని ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ, "ఆపరేషన్ సింధూర్ ఒక విజయం కాదు, భారత సైనికుల అఖండ నిబద్ధతకు గుర్తు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సైనికులు సాధించిన విజయం అత్యంత గర్వకారణం," అని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి జవానుకీ, సైనికాధికారికీ , భారత ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా భారత సైనికుల కుటుంబాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వారు అడ్డుగోడలా నిలబడినప్పుడు వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొంటాయని, అందువల్ల వారికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వివరించారు."ప్రతి విజయం వెనుక ఉన్నది ఒక ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ఒక సైనికుడు. జై జవాన్, జై హింద్," అని పేర్కొంటూ ఈ రోజును జాతీయ గర్వ దినంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు హరీష్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, ఎస్. రంగా రెడ్డి, యంజల్ జగన్, శ్రీధర్ గౌడ్, కిరణ్, మాధవి, విజయ్ శ్రీ, ముత్యం రెడ్డి, కడారి యాదగిరి, రాఘవేందర్, కిరణ్ రెడ్డి, అనిల్, ధర్మేందర్, మధుకర్, మహేష్, జయ తేజ, ఎల్లా రెడ్డి, నవీన్ షా, శేఖర్తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత