రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో అవగాహన

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలతో అవగాహన

బండరావిరాల గ్రామం, అబ్దుల్లాపుర్మెట్ మండల్, రంగా రెడ్డి జిల్లా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అవగాహన కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయం లో వివిధ అంశాలపైన అవగాహన కల్పించడం జరిగింది. పంటల్లో రసాయనాల యాజమాన్యం, పురుగు, తెగుళ్ల యాజమాన్యం, నేల సారం పెంచే విధానాలు, పంట మార్పిడి యొక్క ప్రయోజనాలు, సాగు నీటి యాజమాన్యం మరియు పర్యావరణ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డా. కె కవిత, ప్రధాన శాస్త్రవేత్త మరియు డా. ఎన్ జెమీమా శాస్త్రవేత్త, సస్యరక్షణ అవశేషాల విభాగము, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాయం, రాజేంద్రనగర్ వివరించడం జరిగింది.
రైతులు ఈ కార్యక్రమం లో ఉత్సాహంగా పాల్గొని వారు సాగులో ఎదుర్కుంటున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. రైతులకు వరి వంగడాలు, వాటి లభ్యత గురించి ఎస్ పల్లవి, విస్తరణ శాస్త్రవేత్త వివరించారు. వ్యవసాయం లోని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విశ్వవిద్యాల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ పల్లవి, మండల వ్యవసాయ అధికారి, రఘుపతి, వ్యవసాయవిస్తరణ అధికారి, మధు సూదనా చారి, మండల పంచాయత్ అధికారి, నవనీత పంచాయత్ కార్యదర్శి, మేధ, వ్యవసాయ విద్యార్థి మరియు బందిరావిరాల గ్రామ రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య యాదవ్
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...
నాగోల్ లో సింధూర్ ఆపరేషన్ విజయోత్సవం సందర్భంగా రామాలయంలో పూజలు
పలు గ్రామాలలో ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
 అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ
చెత్త కుప్పలు ఎత్తడంలో నిర్లక్ష్యం ఎందుకు
మేడ్చల్ ఏ.సి.పి శ్రీనివాస్ రెడ్డి బదిలీ
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత